• Home
  • keyboard_arrow_right Abhaya Ayurveda
  • keyboard_arrow_rightPodcasts
  • keyboard_arrow_right
  • keyboard_arrow_right శీతాకాలంలో ఆయుర్వేదం ప్రకారం మనం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
play_arrow

Abhaya Ayurveda

శీతాకాలంలో ఆయుర్వేదం ప్రకారం మనం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Dwani December 19, 2022


Background
share close

ఏ కాలంలోనైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. శీతాకాలంలో కూడా పలు రకాల వ్యాధులు ప్రజలను భయపెడుతుంటాయి. శీతాకాలంలో గుండె జబ్బులు విజృంభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారు ఈ కాలంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. మన దేశంలో కూడా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనంగా తగ్గుతాయి. ఒక సమయంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి.దీంతో ఈ కాలంలో మనం అప్రమత్తంగా ఉంటే రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

శీతాకాలంలో చల్లని పదార్థాలు తినకూడదు. వేడిగా ఉన్నప్పుడే తింటే మంచిది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చలికాలంలో రక్తపోటులో కూడా హెచ్చుతగ్గులు రావడం సహజమే. దీంతో వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకుంటే ప్రయోజనం. బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలు స్వెటర్లు వేసుకుంటేనే చలి నుంచి రక్షణ కలుగుతుంది. వృద్ధులు కూడా వేడిగా ఉండేందుకు ఉన్ని దుస్తులు ధరించడం శ్రేయస్కరం. దీంతో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది.

కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు, చల్లనివి తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మేలు కలుగుతుంది. ఉష్ణోగ్రతను పెంచుకునేందుకు కాఫీ, టీ వంటివి తాగుతూ శరీరాన్ని వేడి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువా ఉండటంతో దాని నుంచి రక్షించుకునేందుకు పలు దుస్తులు ధరిస్తేనే మంచిది. చలి నుంచి రక్షించుకునేందుకు పలు మార్గాలు అన్వేషించాలి. చలి తీవ్రతతో పలు రోగాలు విజృంభించే వీలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.

Rate it
Previous episode
Abhaya Ayurveda
play_arrow
share playlist_add
close

Abhaya Ayurveda

మనం రోజువారీ జీవితంలో వాడుతున్న లవంగంలో ఉన్న గుణాలు, వాటి ప్రాముక్యత ఏంటో తెలుసుకుందాం

Dwani November 14, 2022

లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, […]

Read more trending_flat

Post comments (0)

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

error: SORRY! You are not allowed to do this !!